Breaking News

స్టేడియం బ‌య‌ట‌కు బంతి.. ప్రీతి జింటా రియాక్ష‌న్ వైర‌ల్‌! వీడియో

Published on Sun, 05/04/2025 - 23:03

ఐపీఎల్‌-2025లో ధ‌ర్మ‌శాల వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్ శ‌శాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శ‌శాంక్ సింగ్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 

కేవ‌లం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే శశాంక్ త‌న ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ సిక్స‌ర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్ వేసిన మయాంక్ యాదవ్ నాలుగో బంతిని శ‌శాంక్ సింగ్‌కు బ్యాక్-ఆఫ్-ఎ-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. 

ఆ డెలివ‌రీని శ‌శాంక్ సింగ్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్ మీదుగా 92 మీట‌ర్ల భారీ సిక్స్ కొట్టాడు. అత‌డి ప‌వ‌ర్ దాటికి బంతి మైదానం బ‌య‌ట ప‌డింది. ఈ క్ర‌మంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా అద్బుత‌మైన రియాక్ష‌న్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 236 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్‌(45), శశాంక్ సింగ్‌(33), ఇంగ్లిష్‌(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్‌, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)