Breaking News

పంజాబ్‌ కింగ్స్‌లో విభేదాలు.. కోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా?

Published on Sat, 08/17/2024 - 11:35

ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాం‍చైజీలో ముసలం చోటు చేసుకుంది. ఆ జట్టు యజమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్‌, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. 

ఇందులో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్‌ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్‌ పాల్‌ అనే వ్యాపార‌వేత్త‌కు ఉంది. అయితే అత్య‌ధిక వాటా క‌లిగిన బ‌ర్మ‌న్‌.. తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

త‌న వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ డీల్ కుదుర్చుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలోనే  త‌న స‌హయాజ‌మ‌ని అయిన బ‌ర్మ‌న్ షేర్ల‌ను విక్ర‌యించకుండా అడ్డుకోవాల‌ని ప్రీతీ జింటా చండీగఢ్‌ హైకోర్టును ఆశ్రయించిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ కేసుపై ఆగ‌స్టు 20న హైకోర్టులో విచారణ జ‌ర‌గ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

కాగా అంత‌ర్గ‌త ఒప్పందాల ప్ర‌కారం..  ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాల్సిందే. అయితే బ‌ర్మ‌న్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కిన‌ట్లు వినికిడి.

 కాగా ఈ విష‌యంపై పంజాబ్ కింగ్స్ ప్ర‌తినిథులు నుంచి మాత్రం ఎటువంటి ఆధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్‌ మాత్రం కొట్టిపారేశాడు.  "తన షేర్లను విక్రయించే ఆలోచన లేదు" అని క్రిక్‌బజ్‌తో బర్మన్‌ పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)