Breaking News

ఏడేళ్ల తర్వాత...

Published on Mon, 09/22/2025 - 04:05

గురుగ్రామ్‌: హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యడ్లపల్లి ప్రాంజల ఏడేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సర్క్యూట్‌లో డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన ఐటీఎఫ్‌ డబ్ల్యూ–15 మహిళల టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కే చెందిన చిలకలపూడి శ్రావ్య శివానితో కలిసి ప్రాంజల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రాంజల–శివాని జోడీ 6–4, 6–0తో భారత్‌కే చెందిన మహిక ఖన్నా–సోహిని మొహంతి ద్వయంపై గెలుపొందింది. 

63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల–శ్రావ్య శివాని ద్వయం ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. ప్రాంజల కెరీర్‌లో ఇది ఏడో ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌. 2018లో చివరిసారి ఆమె రుతుజా భోసలేతో కలిసి థాయ్‌లాండ్‌లో రెండు డబుల్స్‌ టైటిల్స్‌ సాధించింది. 2017లో నాలుగు డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గింది. సింగిల్స్‌ విషయానికొస్తే ప్రాంజల నాలుగు టైటిల్స్‌ నెగ్గగా... 2021లో చివరిసారి బెంగళూరు ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 

ఆ తర్వాత గాయాల బారిన పడటంతో ప్రాంజల కెరీర్‌ తడబడింది. మరోవైపు శ్రావ్య శివాని కెరీర్‌లో ఇది మూడో ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌. 25 ఏళ్ల శ్రావ్య శివాని 2021లో షర్మదా బాలుతో కలిసి మొనాస్టిర్‌ ఓపెన్‌ టోర్నీలో, 2022లో సిలైన్‌ సిమున్యు (ఐర్లాండ్‌)తో కలిసి నైరోబి ఓపెన్‌ టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది.  

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)