Breaking News

గుకేశ్‌కు ప్రజ్ఞానంద షాక్‌

Published on Wed, 08/20/2025 - 04:27

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): సింక్‌ఫీల్డ్‌ కప్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ సంచలన ఫలితంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో భారత్‌కే చెందిన క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ప్రపంచ చెస్‌ లైవ్‌ రేటింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. 

క్వీన్స్‌ గాంబిట్‌ పద్ధతిలో మొదలైన ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద ఎత్తులకు సమాధానం ఇచ్చేందుకు గుకేశ్‌ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఒకదశలో సమయాభావంవల్ల గుకేశ్‌ దీటైన ఎత్తులు వేయలేకపోయాడు. చివరకు 36 ఎత్తులు ముగిశాక గుకేశ్‌ ఓటమిని అంగీకరించాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. 

మరోవైపు లెవోన్‌ అరోనియన్‌ (అమెరికా) 41 ఎత్తుల్లో నొదిర్బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందగా... సో వెస్లీ (అమెరికా)–సామ్‌ సెవియాన్‌ (అమెరికా) మధ్య గేమ్‌ 56 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)–మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌) గేమ్‌ 58 ఎత్తుల్లో... ఫాబియానో కరువానా (అమెరికా)–జాన్‌ క్రిస్టాఫ్‌ డూడా (పోలాండ్‌) గేమ్‌ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)