Breaking News

ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో భారత హాకీ స్టార్లు

Published on Wed, 09/18/2024 - 17:17

భారత దిగ్గజం, మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) స్టార్స్‌ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్‌ఐహెచ్‌ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్‌ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు. 

ఎవరు ఏ కేటగిరీలో అంటే?
కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్‌‌ హర్మన్‌తో పాటు గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ కేటగిరీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు బ్రింక్‌మన్, జోప్‌ డి మోల్‌ (నెదర్లాండ్స్‌), ముల్లర్‌ (జర్మనీ), వాలెస్‌ (ఇంగ్లండ్‌) నామినేట్‌య్యాడు.

ఇక.. ‘బెస్ట్‌ గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కోసం పీఆర్‌ శ్రీజేశ్, పిర్మన్‌ బ్లాక్‌ (నెదర్లాండ్స్‌), కాల్‌జడో (స్పెయిన్‌), డేన్‌బర్గ్‌ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు.  ఎఫ్‌ఐహెచ్‌ నియమించిన నిపుణుల ప్యానెల్‌ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌లో పలువురు ప్లేయర్లు, కోచ్‌లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. 

విజేతల్ని ఎంపిక చేస్తారిలా!
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్, నేషన్స్‌ కప్‌ హాకీ, ఒలింపిక్‌ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్‌... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్‌ చేసింది. 

ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్‌లో పోల్‌ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్‌లో భారత్‌ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ తాజాగా ఆసియా చాంపియన్స్‌లో భారత్‌కు టైటిల్‌ అందించిన జోష్‌లో ఉన్నాడు.

చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)