Breaking News

వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్‌.. స్లోవేనియాకు వెళ్లనున్న గుంటూరు అమ్మాయి

Published on Sat, 10/28/2023 - 17:40

స్లోవేనియా వేదికగా జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్ పాల్గోనుంది. కాగా అల్మస్‌ 57 కేజీ విభాగంలో పోటీ పడనుంది. ఈ ఈవెంట్‌ కోసం ఆమె ఆదివారం(ఆక్టోబర్‌29)  స్లోవేనియాకు పయనం కానుంది. ఈ విషయాన్ని అల్మస్ కోచ్‌ ఎస్కే సందాని తెలియజేశారు.  ఈ ఛాంపియన్‌ షిప్‌లో అల్మస్ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

కాగా ఈ వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీలలో భారత్‌ నుంచి నలుగురు లిఫ్టర్స్ పాల్గోనున్నారు.  అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్తున్న సాదియా అల్మస్‌కు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకారరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణ ఆల్‌ది బెస్ట్‌ తెలియజేశారు.

ఈ సందర్భంగా షేక్ సాదియా మాట్లాడుతూ..వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనటానికి అర్హత సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.  అవకాశం కల్పించిన పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షులు సతీష్ కుమార్ గారికి , కార్యదర్శి పీజీ జోసప్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పోటీలో  పతకం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. సిరాజ్‌కు నో ఛాన్స్‌! జట్టులోకి సీనియర్‌ ఆటగాడు

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)