Breaking News

క్రికెట్‌ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్‌.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్‌

Published on Thu, 03/09/2023 - 15:15

వెస్టిండీస్‌ టీ20 కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పావెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్‌.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

భారీ సిక్సర్‌ బాదిన పావెల్‌..
ఈ మ్యాచ్‌లో పావెల్‌ 116 మీటర్ల ఓ భారీ సిక్సర్‌ బాదాడు. 15 ఓవర్‌ వేసిన మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో తొలి బంతిని పావెల్‌ సిక్స్‌గా మలిచాడు. పావెల్‌ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దెబ్బకు నవాజ్‌కు ప్యూజ్‌లు ఎగిరిపోయాయి. పావెల్‌ కొట్టిన సిక్స్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ చరిత్రలోనే బిగెస్ట్‌ సిక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  క్వెట్టా గ్లాడియేటర్స్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

క్వెట్టా ఓపెనర్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్‌) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇదే  మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్‌ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు.
చదవండిBGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు