Breaking News

జూనియర్‌ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చిత్తు

Published on Fri, 01/10/2025 - 09:04

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025(SA20) ను డిఫెండిండ్‌ ఛాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్‌ జార్జ్‌ పార్క్ వేదికగా ఏంఐ కేప్‌ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.

ఎంఐ ఆల్‌రౌండర్‌ డెలానో పోట్‌గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పోట్‌గీటర్‌ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు, లిండే, ఒమర్జాయ్‌ తలా వికెట్‌ సాధించారు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(19) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.

బ్రెవిస్‌ విధ్వంసం..
అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సన్‌రైజర్స్‌ పేసర్‌​ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్‌ చేసిన కేప్‌టౌన్‌ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్‌ కావడంతో కేప్‌టౌన్‌ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.

 

 

కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్‌ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్‌గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మార్కో జానెసన్‌, గ్లీసన్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్‌ డాసన్‌, హర్మర్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇదే తొలి విజయం..
కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌ జట్టుపై ఎంఐకేప్‌టౌన్‌కు ఇదే తొలి విజయం కావడం​ గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పోట్‌గీటర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)