Breaking News

నికోలస్‌ పూరన్‌ ఊచకోత.. ఫాస్టెస్ట్‌ సెంచరీ! 13 సిక్స్‌లతో

Published on Mon, 07/31/2023 - 10:01

మేజర్ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌ ఛాంపియన్స్‌గా ముంబై న్యూయర్క్‌ నిలిచింది. డల్లాస్‌ వేదికగా జరిగిన ఫైనల్లో సీటెల్ ఓర్కాస్‌ను 7 వికెట్ల తేడాతో న్యూయర్క్‌ చిత్తు చేసింది.  184 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై న్యూయర్క్‌ 3 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. 

నికోలస్‌ పూరన్‌ ఊచకోత..
ఇక ఫైనల్‌ పోరులో ముంబై న్యూయర్క్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పూరన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన ఈ కరేబియన్‌ వీరుడు.. కేవలం 40 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా మేజర్ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్‌ నిలిచాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ 10 ఫోర్లు, 13 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 184 టార్గెట్‌లో 70 శాతం పైగా పరుగులు పూరన్‌ సాధించినవే కావడం గమానర్హం. కాగా ఈ టోర్నీ ఆసాంతం పూరన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్‌ నిలిచాడు. 8 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ 388 పరుగులు సాధించాడు.

డికాక్‌ ఇన్నింగ్స్‌ వృధా..
ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీటెల్ ఓర్కాస్‌ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓర్కాస్‌ బ్యాటర్లలో డికాక్‌(87) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితోపాటు శుబమ్‌ రాజనే(29) పరుగుతో రాణించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. టేలర్, డేవిడ్‌ వీసీ చెరో వికెట్‌ పడగొట్టారు.
చదవండి: IND vs WI: బంతిని చూడకుండా భారీ సిక్సర్‌.. షాక్‌ తిన్న టీమిండియా బౌలర్‌! వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)