Breaking News

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే: పాంటింగ్

Published on Wed, 08/14/2024 - 11:00

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా  ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.

గత రెండు పర్యాయాలు కంగారుల‌ను వారి సొంత‌ గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్ట‌డమే ల‌క్ష్యంగా పెట్టుకుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2025 ఫైన‌ల్‌కు చేరాలన్న ఈ సిరీస్‌కు భార‌త్‌కు ఎంతో కీల‌కం. 

మ‌రోవైపు ఈసారి భార‌త్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి త‌మ 9 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ను ఆసీస్ చివ‌ర‌గా 2014-15లో సొంతం చేసుకుంది. 

ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈసారి టెస్టు సిరీస్‌లో టీమిండియాను ఆసీస్ కచ్చితంగా  ఓడిస్తుంద‌ని పాంటింగ్ థీమా వ్య‌క్తం చేశాడు.

"భార‌త్‌-ఆసీస్ మ‌ధ్య పోటీ ఎల్ల‌ప్పుడూ ప్ర‌త్యేక‌మే. ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జ‌ట్ల మ‌ధ్య  హోరాహోరీగా సాగడం ఖాయం. గ‌త రెండు పర్యాయాలు భార‌త్ చేతిలో ఓట‌మి చ‌విచూసిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం సొంతగడ్డపై  తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 

మ‌ళ్లీ ఐదు టెస్టుల సిరీస్‌ను తీసుకురావ‌డం ఇరు జ‌ట్ల‌కు క‌లిసొచ్చే ఆంశం. ఇది నిజంగా కీల‌క‌ప‌రిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గ‌త రెండు సార్లు కేవ‌లం నాలుగు టెస్టులు మాత్ర‌మే ఇరు జ‌ట్లు మ‌ధ్య జ‌రిగాయి.

ఇప్పుడు మ‌ళ్లీ ఐదు టెస్టులు జ‌ర‌గ‌నుండ‌డంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్‌లో డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు.  కానీ ఆస్ట్రేలియానే గెల‌వాల‌ని కోరుకుటున్నాను. ఆసీస్ గెలిచేందుకు స‌ల‌హాలు ఇస్తా.

 ఏదో ఒక మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది.   కేవ‌లం ఒక్క మ్యాచ్ మాత్ర‌మే భార‌త్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌ను  ఆస్ట్రేలియా. 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా" అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. 

కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ టెస్టు సిరీస్‌ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)