Breaking News

కష్టాల్లో ఉన్న జట్టును వదిలేసిన రషీద్‌ ఖాన్‌

Published on Fri, 01/16/2026 - 12:43

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ సీజన్‌ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8 మ్యాచ్‌ల్లో 5) ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఎలిమినేషన్‌ అంచును ఆ జట్టును తాజాగా రషీద్‌ ఖాన్‌ వీడి వెళ్లాడు. జాతీయ విధులకు (వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం) హాజరయ్యేందుకు రషీద్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నుంచి తప్పుకున్నాడు.

కష్ట సమయాల్లో రషీద్‌ వెళ్లిపోవడం మినుకుమినుకుమంటున్న ఎం కేప్‌టౌన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసింది. రషీద్‌ స్థానంలో యాజమాన్యం పొట్టి క్రికెట్‌ దిగ్గజం కీరన్‌ పోలార్డ్‌ను జట్టులో చేర్చుకుంది. పోలార్డ్‌ జట్టులో చేరినా ఎంఐ ఫేట్‌ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టుకు మరో రెండు అవకాశాలు (మ్యాచ్‌లు) మాత్రమే ఉన్నాయి.

ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే.. ఎం కేప్‌టౌన్‌ ఫేట్‌ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్, రస్సీ వాన్ డర్ డసెన్, జేసన్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌లో లేడు. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం, లేని పరుగులను సమర్పించుకోవడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు.  

తదుపరి మ్యాచ్‌ల్లో ఈ లోపాలను అధిగమించగలిగితే ఎంఐ కేప్‌టౌన్‌ విజయాల బాట పట్టవచ్చు. పోలార్డ్ తన పవర్ హిట్టింగ్, ఫీల్డింగ్, మీడియం పేస్ బౌలింగ్‌తో కేప్‌టౌన్‌లో ప్లే ఆఫ్స్‌ దిశగా నడిపించాలని ఆ ఫ్రాంచైజీ అభిమానులు కోరుకుంటున్నారు. 

పోలార్డ్‌ 2024 ఎడిషన్‌లో రషీద్‌ ఖాన్‌ గాయపడినప్పుడు కేప్‌టౌన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ సీజన్‌లో అతను 188 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. పోలార్డ్‌ మరో 101 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొడతాడు.

కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మిగతా బెర్త్‌ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ పోటపడుతున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)