Breaking News

ఇంట్లో డబ్బు సంచులు.. పోలీసులకు చిక్కిన మాజీ క్రికెటర్‌

Published on Tue, 03/05/2024 - 13:21

భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ తుషార్‌ ఆరోథే మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఇంట్లో కోటి రూపాయల నగదు పట్టుబడటంతో వడోదర పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

కాగా గుజరాత్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ తుషార్‌ ఆరోథే. 1985- 2004 మధ్య రంజీల్లో బరోడా జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది.

అయితే, ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం తుషార్‌ ఆరోథే కోచ్‌గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళా జట్టుకు కోచ్‌గా 2013లో నియమితుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ బరోడా కోచ్‌గా వచ్చి.. 2015లో రాజీనామా చేశాడు.

తుషార్‌ ఆరోథే కుమారుడు రిషి ఆరోథే కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటరే. ఇదిలా ఉంటే.. వివాదాలతో సావాసం చేయడం తుషార్‌ ఆరోథేకు అలవాటు. 2019లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ కేఫ్‌లో బెట్టింగ్‌ చేస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

ఈ క్రమంలో బెయిల్‌ మీద విడుదలైన అనంతరం.. క్రికెట్‌ మాత్రమే తనకున్న ఉపాధి అని, ఇలాంటి చెత్త పనులు చేయనంటూ తుషార్‌ ఆరోథే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి పోలీసులకు చిక్కడం గమనార్హం.

తుషార్‌ కొడుకు రిషి అపార్ట్‌మెంట్‌కు భారీ మొత్తంలో నగదు తరలినట్లు తమకు సమాచారం అందిందని స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ ఇన్స్‌పెక్టర్‌ వీఎస్‌ పాటిల్‌ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో తుషార్‌ ఆరోథేకు చెందిన ప్రతాప్‌గంజ్‌ నివాసంలోనూ సోదాలు జరుపగా కోటికి పైగా నగదు పట్టుబడిందని.. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

డబ్బులన్నీ సంచుల్లో కుక్కి పెట్టారని.. ఈ లావాదేవీల గురించి వివరణ అడుగగా తుషార్‌ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా ఆదివారం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)