Breaking News

రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

Published on Tue, 10/29/2024 - 06:13

భారత హాకీ స్టార్, ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన రాణి రాంపాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అసమాన ప్రతిభకు జెర్సీ నంబర్‌ 28 చిరునామాగా మారిందని ఆయన అన్నారు. 29 ఏళ్ల రాణి భారత మహిళల హాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.

 ‘భారత హాకీలో అసమాన ప్రతిభ, అత్యున్నత స్థాయి లక్ష్యాలకు నీ 28 నంబర్‌ జెర్సీ చిరునామాగా నిలిచింది. ఇకపై మైదానంలో ఆ ఆట కనిపించకపోవచ్చు గానీ ఒక అత్యుత్తమ క్రీడాకారిణిగా నువ్వు అందించిన జ్ఞాపకాలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటాయి. అతి పిన్న వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నువ్వు నీ ఆటతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించావు. సారథిగా ముందుండి నడిపించిన నువ్వు ఇప్పుడు రిటైర్మెంట్‌ తర్వాత కూడా కొత్త బాధ్యతతో ఆటలోనే కొనసాగడం సంతోషకరం’ అని మోదీ తన సోషల్‌ మీడియా ద్వారా అభినందించారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)