Breaking News

'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడితే!

Published on Sun, 06/25/2023 - 11:22

భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా బ్యాట్‌ పట్టుడు.. బంతి కొట్టుడు అన్న తరహాలో ఉంటారు. ఇక చిన్న ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఆరోజుకు అది మాదే అనేలా జెండా పాతేస్తారు. ఇక అది ఏ గ్రౌండ్‌ అయినా కానీయండి క్రికెట్‌ మా కింకర్తవ్యం అన్నట్లుగా ఆడేస్తుంటారు. మరి ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడితే  జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి.

విషయంలోకి వెళితే.. ఎక్కడో తెలియదు కానీ కొంతమంది గ్రూప్‌ కలిసి ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడారు. బౌలర్‌ వేసిన బంతిని షాట్‌ ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని మాత్రమే గమనించిన బ్యాటర్‌ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌ను గమనించలేదు. ఇంకేముంది నేరుగా వెళ్లి గోల్‌పోస్ట్‌కు గుద్దుకున్నాడు. పాపం దెబ్బ గట్టిగా తగలడంతో అక్కడే పడిపోయాడు.

తోటివాళ్లు వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే దెబ్బ తాకిన వ్యక్తి నొప్పితో విలవిల్లాలాడుతుంటే మిగతావాళ్లు నవ్వుకోవడం కనిపించింది. ఎంతైనా ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడడమే తప్పు.. పైగా గోల్‌పోస్ట్‌ పక్కనుంచి వికెట్‌ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏదైనా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు రాకుండా మాత్రం ఉండదు. వీలైతే ఒక లుక్కేయండి.

చదవండి: డేంజర్‌ జోన్‌లో విండీస్‌.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా?

అధికారుల కన్నెర్ర.. నెయ్‌మర్‌కు దెబ్బ మీద దెబ్బ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)