Breaking News

IPL 2025 Retentions: జాక్‌పాట్‌ కొట్టిన ఆటగాళ్లు వీరే..!

Published on Fri, 11/01/2024 - 12:39

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్‌ జాబితాను నిన్న (అక్టోబర్‌ 31) విడుదల చేశారు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పలువురు జాక్‌పాట్‌ కొట్టారు. బేస్‌ ధర నుంచి ఏకంగా కోట్లకు పడగలెత్తారు. 

రిటెన్షన్స్‌లో అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు ధృవ్‌ జురెల్‌. ఈ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ను రాయల్స్‌ 20 లక్షల నుంచి 14 కోట్లకు సొంతం చేసుకుంది. జురెల్‌ తర్వాత సీఎస్‌కే పతిరణ, కేకేఆర్‌ రింకూ సింగ్‌ అత్యధికంగా లబ్ది పొందారు. 

పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లకు.. రింకూ సింగ్‌ 55 లక్షల నుంచి 13 కోట్లకు రిటైన్‌ చేసుకోబడ్డారు. వీరి తర్వాత రజత్‌ పాటిదార్‌, మయాంక్‌ యాదవ్‌ 20 లక్షల బేస్‌ ధర నుంచి 11 కోట్లకు రిటైన్‌ చేసుకోబడ్డారు. 

ఓవరాల్‌గా చూస్తే రిటెన్షన్స్‌ అనంతరం అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా హెన్రిచ్‌ క్లాసెన్‌ నిలిచాడు. క్లాసెన్‌కు గత సీజన్‌ శాలరీ 5.25 కోట్లు కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఈసారి అతన్ని ఏకంగా 23 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే క్లాసెన్‌ శాలరీ ఏకంగా 17.75 కోట్లు పెరిగింది.

రిటెన్షన్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాళ్లు వీరే..!

హెన్రిచ్‌ క్లాసెన్‌ 5.25 కోట్ల నుంచి 23 కోట్లు
ధృవ్‌ జురెల్‌ 20 లక్షల నుంచి 14 కోట్లు
మతిశ పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లు
రింకూ సింగ్‌ 55 లక్షల నుంచి 13 కోట్లు
రజత్‌ పాటిదార్‌ 20 లక్షల నుంచి 11 కోట్లు
మయాంక్‌ యాదవ్‌ 20 లక్షల నుంచి 11 కోట్లు
సాయి సుదర్శన్‌ 20 లక్షలు నుంచి 8.5 కోట్లు
నితీశ్‌ కుమార్‌ రెడ్డి 20 లక్షల నుంచి 6 కోట్లు
శశాంక్‌ సింగ్‌ 20 లక్షల నుంచి 5.5 కోట్లు

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)