PKL 2023: తలైవాస్‌పై పాంథర్స్‌ గెలుపు 

Published on Sun, 12/24/2023 - 09:01

Pro Kabaddi League 2023- చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిపెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ 25–24తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. అర్జున్‌ దేశ్వాల్‌ (7 పాయింట్లు), రెజా మిర్‌బగెరి (5), సునీల్‌ కుమార్‌ (4), అజిత్‌ (3) రాణించారు.

తలైవాస్‌ తరఫున హిమాన్షు నర్వాల్‌ 8 పాయింట్లు సాధించాడు. తద్వారా ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది డేగా నిలిచాడు. ఇక తలైవాస్‌పై తాజా విజయంతో జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

మరోవైపు.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 38–30తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. గుజరాత్‌ విజయంలో రెయిడర్‌ రాకేశ్‌ (14) కీలకపాత్ర పోషించాడు. 


బంగ్లా చేతిలో కివీస్‌ చిత్తు 
నేపియర్‌: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లాదేశ్‌కు ఊరట విజయం దక్కింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లాపై ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. యంగ్‌ (26) టాప్‌ స్కోరర్‌ కాగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తన్‌జీమ్‌ హసన్‌ (3/14), సౌమ్య సర్కార్, షరీఫుల్‌ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 99 పరుగులు చేసింది. నజ్ముల్‌ హుస్సేన్‌ (51 నాటౌట్‌), అనాముల్‌ హక్‌ (37) రాణించారు. కివీస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌ 2–1తో సిరీస్‌ సొంతం చేసుకుంది.    

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)