Breaking News

PKL 12: పుణేరి పల్టన్‌ హ్యాట్రిక్‌

Published on Sun, 10/05/2025 - 09:15

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో పుణేరి పల్టన్‌ వరుసగా మూడో విజయం  ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో పుణేరి పల్టన్‌ 41–36 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. పల్టన్‌ తరఫున ఆదిత్య షిండే 13 పాయింట్లు సాధించగా... కెప్టెన్‌ పంకజ్‌ మోహితె 8 పాయింట్లు సాధించాడు.

మరోవైపు... జైపూర్‌ తరఫున అలీ సమది 22 పాయింట్లతో విజృంభించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 47–40 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. ఆదివారం యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి.  

ఇదీ చదవండి: ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి 
అల్‌ అయిన్‌ (యూఏఈ): భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌... అల్‌ అయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లో పరాజయం పాలవగా... మహిళల విభాగంలో తస్నీమ్‌ మీర్, శ్రియాన్షి వలిశెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లారు. 

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 4–21, 21–11, 19–21తో రెండో సీడ్‌ ఆదిల్‌ షోలెహ్‌ (మలేసియా) చేతిలో పోరాడి ఓడాడు.

ఇక మహిళల సింగిల్స్‌లో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ జూనియర్‌ నంబర్‌వన్, 20 ఏళ్ల తస్నీమ్‌ మీర్‌ సత్తాచాటింది. సెమీస్‌లో ఆరో సీడ్‌ తస్నీమ్‌ 9–21, 21–17, 21–10తో ఐదో సీడ్‌ నెస్లిహన్‌ అరిన్‌ (తుర్కియే)పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఏడో సీడ్‌ శ్రియాన్షి 21–11, 21–12తో చియారా మార్వెల్లా హండోయో (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. 

ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తస్నీమ్, శ్రియాన్షి టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌–100 ఫైనల్‌.   

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)