Breaking News

ఈ నెల 31న పీకేఎల్‌ ఫైనల్‌

Published on Sat, 10/11/2025 - 08:18

న్యూఢిల్లీ: హోరాహోరీ పోరాటాలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌ ఫైనల్‌ ఈ నెల 31న జరగనుంది. శనివారం నుంచి ఢిల్లీ అంచె పోటీలు ప్రారంభం కానుండగా... లీగ్‌ దశ ముగిసిన అనంతరం ప్లే ఆఫ్స్‌ కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం పీకేఎల్‌ నిర్వాహకులు ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 23తో లీగ్‌ దశకు తెరపడనుండగా... పాయింట్ల పట్టికలో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి. 

జట్ల మధ్య మరింత పోటీ పెంచేందుకు... తాజా సీజన్‌ నుంచి పీకేఎల్‌లో పలు మార్పులు చేశారు. ఈ నెల 25 నుంచి జరగనున్న ‘ప్లే ఇన్స్‌’లో పట్టికలో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లు తలపడతాయి. అందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగు పెడుతుంది. అక్టోబర్‌ 26 నుంచి 29 వరకు ప్లే ఆఫ్స్‌ జరుగుతాయి. తొలి రోజు ఎలిమినేటర్‌–1, మినీ క్వాలిఫయర్‌... మరుసటి రోజు ఎలిమినేటర్‌–2, క్వాలిఫయర్‌–1 నిర్వహిస్తారు. అక్టోబర్‌ 28న ఎలిమినేటర్‌–3, 29న క్వాలిఫయర్‌–2 నిర్వహిస్తారు. 

ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ఈ నెల 31 శుక్రవారం జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తాజా సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా... అభిమానుల్లో ఆసక్తి పెంపొందించేందుకే ఎక్కువ జట్లు ప్లే ఆఫ్స్‌ చేరే విధంగా టోర్నీని మార్చారు. దీంతో హోరాహోరీ పోరాటాలు పెరగడంతో పాటు... ప్రతి జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఫైనల్‌ నిర్వహించనుండటం ఇది నాలుగోసారి. ఇక ఈ సీజన్‌లో విజృంభిస్తున్న దబంగ్‌ ఢిల్లీ జట్టు... ఇప్పటికే టాప్‌–8 చోటు ఖాయం చేసుకుంది.   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)