Breaking News

PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్‌’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి

Published on Mon, 11/11/2024 - 10:30

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబా ‘హ్యాట్రిక్‌’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్‌పై గెలిచింది.

యు ముంబా తరఫున అజిత్‌ చవాన్, రోహిత్‌ రాఘవ్‌ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్‌ తరఫున భరత్‌ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.

ఇక తాజా సీజన్‌లో యు ముంబా 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్‌ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. 

గుజరాత్‌ జెయింట్స్‌ ఓటమి
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్‌ తరఫున రాహుల్‌ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రాకేశ్‌ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. 

మరోవైపు... గుజరాత్‌ జెయింట్స్‌ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్‌ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్‌ అస్థానంలో కొనసాగుతోంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)