Breaking News

PKL 11: దుమ్ములేపిన దబాంగ్‌ ఢిల్లీ.. తమిళ్‌ తలైవాస్‌ చిత్తు

Published on Mon, 12/02/2024 - 09:38

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌పై దబంగ్‌ ఢిల్లీ ఘన విజయం సాధించింది. స్టార్‌ రెయిడర్‌ నవీన్‌ కుమార్‌ 11 పాయింట్లతో సత్తా చాటడంతో.. ఆదివారం జరిగిన పోరులో దబంగ్‌  32–21 పాయింట్లతో తలైవాస్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ జట్టు తరఫున నవీన్‌ కుమార్, ఆశు మలిక్‌ (5 పాయింట్లు) రాణించారు.

ఇక తలైవాస్‌ తరఫున మోయిన్‌ (8 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 18 రెయిడ్‌ పాయింట్లు, 12 ట్యాకిల్‌ పాయింట్లు సాధించగా... తలైవాస్‌ ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది.

తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లు నమోదు చేసుకుంది. 48 పాయింట్లతో ఢిల్లీ మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 15 మ్యాచ్‌ల్లో 9వ పరాజయం మూటగట్టుకున్న తలైవాస్‌ 33 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.

బెంగాల్‌ వారియర్స్‌పై పట్నా గెలుపు
మరోవైపు... హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 38–35 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. పైరేట్స్‌ తరఫున దేవాంక్‌ 13 పాయింట్లు, అయాన్‌ 8 పాయింట్లతో ఆకట్టుకోగా... వారియర్స్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో పోరాడాడు. 

ఇరు జట్లు అటు రెయిడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో సమంగా నిలిచినా... ఎక్స్‌ట్రాల రూపంలో 4 పాయింట్లు సాధించిన పైరేట్స్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం నుంచి పుణే వేదికగా పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలుత బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ జెయింట్స్, యు ముంబాతో పుణేరి పల్టన్‌ తలపడతాయి.  

చదవండి: బిగ్‌బాష్‌ లీగ్‌ విజేత మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)