Breaking News

ఢిల్లీ ధమాకా

Published on Fri, 11/08/2024 - 22:44

హైదరాబాద్‌, నవంబర్‌ 8: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్‌(12) మరోమారు సూపర్‌-10 ప్రదర్శనతో విజృంభిస్తే..ఢిపెండర్లు యోగేశ్‌(7), అశిష్‌ మాలిక్‌(7), మను(5) రాణించారు. మరోవైపు అనూహ్య ఓటమి ఎదుర్కొన్న తలైవాస్‌ తరఫున నరేందర్‌(6), సచిన్‌(4), సాహిల్‌(4), మోయిన్‌(4) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో దబాంగ్‌ ఢిల్లీ 24 పాయింట్లతో మూడో స్థానంలోకి వచ్చింది. తలైవాస్‌ మూడో ఓటమితో 5వ స్థానానికి పరిమితమైంది. 

ఢిల్లీ దూకుడు:ప్రొ కబడ్డీ లీగ్‌లో రైవలరీ వీక్‌ రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో ముందంజ వేయాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ప్రతీ జట్టు తుదికంటా పోరాడుతున్నాయి. ఓవైపు ఢిల్లీ వరుస ఓటములతో సతమతమవుతుంటే మరోవైపు తమిళ్‌ తలైవాస్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. శుక్రవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తమదైన దూకుడు కనబరిచింది. స్టార్‌ రైడర్‌ నవీన్‌ గైర్హాజరీలో అషు మాలిక్‌ ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ 17వ నిమిషంలో అషు మాలిక్‌ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు 14వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన నరేందర్‌ను యోగేశ్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీకి పాయింట్‌ వచ్చింది. ఆ తర్వాత రైడ్లలో కూడా నరేందర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే అదనుగా ఢిల్లీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఓవైపు రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌తో తలైవాస్‌కు చెక్‌ పెడుతూ ప్రథమార్ధం ముగిసే సరికి ఢిల్లీ 16-10తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 

అషు మాలిక్‌ విజృంభణ: ప్రథమార్ధంలో పెద్దగా జోరు కనబర్చని ఢిల్లీ రైడర్‌ అషు మాలిక్‌..కీలకమైన ద్వితీయార్ధంలో పంజా విసిరాడు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో చెలరేగుతూ ఢిల్లీని ఆధిక్యంలో నిలుపడంలో కీలకమయ్యాడు. 20వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన మను..అమిఈర్‌, అనూజ్‌ను ఔట్‌ చేసి ఢిల్లీకి రెండు పాయింట్లు అందించాడు. ఈ క్రమంలో 18వ నిమిషంలో అషు మాలిక్‌..సచిన్‌ను ఔట్‌ చేయడంతో తలైవాస్‌ తొలిసారి ఆలౌటైంది. ఓవైపు రైడింగ్‌లో అషు మాలిక్‌ అదరగొడితే డిఫెన్స్‌లో యోగేశ్‌, అశిష్‌ మాలిక్‌..తలైవాస్‌ పనిపట్టారు. ఎక్కడా పట్టు వదలకుండా పాయింట్ల వేటలో తలైవాస్‌పై ఢిల్లీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తలైవాస్‌ తరఫున నరేందర్‌, సచిన్‌, సాహిల్‌ రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)