Breaking News

PKL 11: సెమీస్‌కు దూసుకెళ్లిన దబంగ్‌ ఢిల్లీ

Published on Tue, 12/24/2024 - 10:34

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదకొండో సీజన్‌లో మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ జట్టు ఎదురులేని విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకు వెళ్లింది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 41–35తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొంది.. సెమీస్‌కు అర్హత సాధించింది. 

కాగా వరుసగా గత 15 మ్యాచ్‌లుగా దబంగ్‌ ఢిల్లీ ఒక్కటీ ఓడిపోలేదు. వీటిలో పదమూడింట గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. తద్వారా టాప్‌–2లో నిలిచి ఢిల్లీ నేరుగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. 

ఇక గుజరాత్‌తో జరిగిన పోరులో ఢిల్లీ కెప్టెన్, రెయిడర్‌ అశు మలిక్‌ 17 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు అతడి సహచరుల్లో ఆల్‌రౌండర్‌ ఆశిష్‌ 7, రెయిడర్‌ నవీన్‌ 6, డిఫెండర్‌ ఆశిష్‌ 4 పాయింట్లు సాధించారు.

ఆరు జట్లు నాకౌట్‌కు
మరోవైపు.. గుజరాత్‌ తరఫున ఆల్‌రౌండర్‌ జితేందర్‌ యాదవ్‌ (7) ఆకట్టుకోగా, కెప్టెన్‌ గుమన్‌ సింగ్‌ (5), హిమాన్షు (5) రాణించారు. ఇదివరకే టాప్‌లో నిలిచిన హరియాణా స్టీలర్స్‌తో పాటు ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా సెమీస్‌కు అర్హత సంపాదించాయి. తర్వాత 3, 4, 5, 6వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో ఆడి ఇందులోంచి రెండు జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి.

తమిళ్‌ తలైవాస్‌పై గెలుపు
ఇదిలా ఉంటే.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 42–32తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. పుణేరి రెయిడర్లు ఆర్యవర్ధన్‌ నవలే (10), అజిత్‌ (7) అదరగొట్టారు. డిఫెండర్లలో గౌరవ్‌ ఖత్రి (5), అమన్‌ (4) రాణించారు. 

తలైవాస్‌ తరఫున ఆల్‌రౌండర్‌ హిమాన్షు (8), రెయిడర్‌ సచిన్‌ (7) పోరాడారు. కెప్టెన్, డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ 5, అమిర్‌ హుస్సేన్‌ 4 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, బెంగాల్‌ వారియర్స్‌తో యు ముంబా తలపడతాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)