Breaking News

PKL10: మనోళ్లు అట్టడుగున.. ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా పాంథర్స్‌

Published on Thu, 02/01/2024 - 09:45

Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌  పింక్‌ పాంథర్స్‌ 42–27తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది.

ఈ టోర్నీలో పింక్‌ పాంథర్స్‌కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో పింక్‌ పాంథర్స్‌ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్‌తో మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు.

అట్టడుగున తెలుగు టైటాన్స్‌
పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్‌ ఢిల్లీతో బెంగాల్‌ వారియర్స్‌; గుజరాత్‌ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్‌కు మాత్రం ఈ సీజన్‌ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)