Breaking News

భారత బౌలర్లను ఉతికారేసిన 22 ఏళ్ల ఆసీస్‌ బ్యాటర్‌

Published on Thu, 10/30/2025 - 18:06

మ‌హిళ‌ల ప్రపంచకప్‌-2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.  భారత బౌలర్లను ఉతికారేసింది.

దీప్తీ శర్మ వం‍టి స్టార్ స్పిన్నర్‌ను సైతం లిచ్‌ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్‌, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె  పెర్రీతో కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్‌ఫీల్డ్‌.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది.

ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్‌.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు  చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో సెంచరీ చేసిన మూడో ఆసీస్‌ ప్లేయర్‌గా లిచ్‌ఫీల్డ్‌ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్‌ ఈ ఫీట్‌ సాధించారు.

అదే విధంగా మహిళల వన్డే ప్ర‌పంచ‌క‌ప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా లిచ్‌ఫీల్డ్ రికార్డు నెల‌కొల్పింది. ఇంత‌కుముందు ఈ రికార్డు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. 

2017 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్‌లో ఆసీస్‌పై హ‌ర్మన్‌ 90 బంతుల్లో సెంచ‌రీ న‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కేవ‌లం 77 బంతుల్లోనే శ‌త‌క్కొట్టిన లిచ్‌ఫీల్డ్‌.. హ‌ర్మ‌న్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.


 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)