Breaking News

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 విజేత స్కార్చర్స్‌

Published on Sun, 01/25/2026 - 18:01

2025-26 ఎడిషన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ అవతరించింది. ఇవాళ (జనవరి 25) జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ కైవసం చేసుకుంది. స్కార్చర్స్‌ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో టైటిళ్లు సాధించింది. 

ప్రస్తుత ఎడిషన్‌లో స్కార్చర్స్‌కు టైటిల్‌ అందించిన ఆష్టన్‌ టర్నర్‌ గతంలో మరో రెండు టైటిళ్లు (కెప్టెన్‌) అందించాడు. తద్వారా లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. బీబీఎల్‌ నిర్వహకులు ఈ ఎడిషన్‌లో కొత్త ఆనవాయితీకి తెరలేపారు. 

విజేతలను అందించే మెడల్స్‌ను చిన్నారుల చేత ఇప్పించారు. స్కార్చర్స్‌ కెప్టెన్‌ టర్నర్‌ తన విన్నింగ్‌ మెడల్‌ను తన ముగ్గురు సంతానం చేతుల మీదుగా అందుకున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. 

సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)