Breaking News

ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాష్‌ లీగ్‌.. తొలి మ్యాచ్‌లో స్టోయినిస్‌ జట్టు ఓటమి

Published on Sun, 12/15/2024 - 17:25

ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ నేతృత్వంలోని మెల్‌బోర్న్‌ స్టార్స్‌.. పెర్త్‌ స్కార్చర్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 

స్టోయినిస్‌ (37), టామ్‌ కర్రన్‌ (37) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో జో క్లార్క్‌ 0, థామస్‌ రోజర్స్‌ 14, సామ్‌ హార్పర్‌ 1, కార్ట్‌రైట్‌ 18, వెబ్‌స్టర్‌ 19, హెచ్‌ మెక్‌కెంజీ 4, ఆడమ్‌ మిల్నే 2, బ్రాడీ కౌచ్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. స్కార్చర్స్‌ బౌలర్లలో జై రిచర్డ్‌సన్‌ 3, లాన్స్‌ మోరిస్‌ 2, బెహ్రెన్‌డార్ఫ్‌, ఆస్టన్‌ అగర్‌, కూపర్‌ కన్నోలీ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్‌ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్‌ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి స్టార్చర్స్‌ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్‌ టర్నర్‌ (37 నాటౌట్‌), నిక్‌ హాబ్సన్‌ (27 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌లతో స్కార్చర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. 

స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ అలెన్‌ (6), కీటన్‌ జెన్నింగ్స్‌ (4), మాథ్యూ హర్స్ట్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో ఆడమ్‌ మిల్నే, పీటర్‌ సిడిల్‌, టామ్‌ కర్రన్‌, బ్రాడీ కౌచ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)