Breaking News

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఎఫెక్ట్‌.. పాక్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ల్లో భారీ కోత

Published on Mon, 03/17/2025 - 14:05

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ వల్ల పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడం వల్ల పీసీబీకి రూ. 869 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై పెట్టిన పెట్టుబడిలో 85 శాతం నష్టాలు వచ్చినట్లు పాక్‌ మీడియానే ప్రచారం చేస్తుంది. టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన భారీ నష్టాలను.. ఆటగాళ్లపై ఆర్దిక అంక్షల ద్వారా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తుంది. 

ఇందులో భాగంగా తొలుత దేశవాలీ క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజ్‌ల్లో  కోత విధించిన పీసీబీ.. తాజాగా జాతీయ ఆటగాళ్లపై కాస్ట్‌ కట్టింగ్‌ కొరడా ఝులిపించింది. పాకిస్తాన్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం​ వహించే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజుల్లో సగానికిపైగా కోత విధించినట్లు తెలుస్తుంది. అలాగే పాక్‌ ఆటగాళ్లు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లలో బస చేయడంపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం.

ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వేదికల ఆధునీకరణ (కరాచీ, లాహోర్‌, రావల్పిండి) కోసమే సగానికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం​. స్టేడియాల మరమ్మత్తుల కోసం ముందుగా అంచనా వేసిన వ్యయం కంటే 50 శాతం అధిక మొత్తం ఖర్చైనట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. బదులుగా స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం గోరంత కూడా లేదని పేర్కొంది.

భారీ అంచనాల మధ్య స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగిన పాక్‌ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో పాక్‌.. న్యూజిలాండ్‌, టీమిండియా చేతుల్లో వరుసగా ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌ వర్షం​ కారణంగా బంతి కూడా పడకుండానే రద్దైంది. 

భారత్‌తో మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడిన పాక్‌.. కోట్లు ఖర్చు చేసి స్వదేశంలో ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడగలిగింది. అందులోనూ న్యూజిలాండ్‌ చేతిలో చావుదెబ్బ తినింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అయినా గెలుద్దాం అనుకుంటే వరుణుడు కరుణించలేదు. 

ఈ టోర్నీలో భారత్‌ చివరి వరకు అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించి మూడో సారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్‌కు టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాల కంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్‌ గెలవడం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంది. 

కాగా, పాక్‌ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన సమస్యల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాక్‌లో ఆడేందుకు అనుమతించలేదు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)