Breaking News

క్లియరెన్స్‌ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ'

Published on Tue, 06/27/2023 - 20:52

వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్‌ వేదికగా ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. 

తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వ​ం క్లియరెన్స్‌ తప్పనిసరి. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్‌ రాలేదు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ రాగానే ఈవెంట్‌ నిర్వహించే ఐసీసీ సమచారం అందిస్తాం. అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది తెలియదు అని చెప్పుకొచ్చాడు.

కాగా పాక్‌ ప్రభుత్వం నుంచి పీసీబీకి వరల్డ్‌కప్‌ ఆడేందుకు క్లియరెన్స్‌ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్‌ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాక్‌ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇచ్చేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కామెంట్‌ చేశారు.

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌, వివరాలు:

అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2
అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్
అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్

అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా
అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్
నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్

చదవండి: ఎదురులేని లంక.. గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ సిక్స్‌కు

ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)