Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. పాక్‌ జట్టుకు ‘స్పెషల్ కోచ్‌’

Published on Sat, 02/22/2025 - 20:01

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఈ ‍మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్‌-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. పాక్‌పై కూడా గెలిచి సెమీస్‌కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.

కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్‌. మొదటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్‌.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం  ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ ‍కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్‌.. ప్రాక్టీస్ సెషన్‌లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.

కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్‌పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్‌ను పాక్‌​ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి  తీసుకుంది. కాగా ముదాసర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 

గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా అత‌డు ప‌నిచేశాడు. అంతేకాకుండా  లాహోర్‌లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.

తుది జ‌ట్లు(అంచనా)
భారత్‌: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

పాకిస్తాన్‌: ఇమామ్ ఉల్ హ‌క్‌, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్‌), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్‌.. సూపర్‌మేన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)