Breaking News

పాక్‌ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్‌

Published on Tue, 08/20/2024 - 17:28

పాకిస్తాన్‌ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్‌ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.

వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నఖ్వీ సందర్శించారు.

మన స్టేడియాలు బాలేవు
ఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్‌ వర్క్స్‌ ఆర్గనైజేషన్‌ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.

ప్రథమ ప్రాధా న్యం అదే
ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్‌ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్‌ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.

ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్‌ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!

చదవండి: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వేదిక అదే: పీసీబీ చీఫ్‌

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు