Breaking News

పాకిస్తాన్‌ సెలెక్షన్‌ కమిటీలోకి మాజీ అంపైర్‌

Published on Fri, 10/11/2024 - 20:31

ముల్తాన్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాజయం ఎదురైన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అసక్తికర నిర్ణయం తీసుకుంది. పీసీబీ ఆ దేశ సెలెక్షన్‌ కమిటీలో పలు మార్పులు చేసింది. ఓ మాజీ అంపైర్‌ సహా మరో ఇద్దరిని కొత్తగా చేర్చింది. ఇటీవలే అంపైరింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అలీం దార్‌, మాజీ ఆటగాళ్లు ఆకిబ్‌ జావెద్‌, అజర్‌ అలీ కొత్తగా సెలెక్షన్‌ కమిటీలో చేరారు. ఈ ముగ్గురికి పీసీబీ ఓటింగ్‌ హక్కు కల్పించింది. 

వీరితో పాటు ఇదివరకే సెలెక్షన్‌ కమిటీలో ఉన్న హసన్‌ చీమాకు కూడా పీసీబీ ఓటింగ్‌ హక్కు కల్పించింది. కాగా, పది రోజుల కిందటే మొహమ్మద్‌ యూసఫ్‌ సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశాడు. ఇంతలోనే పీసీబీ కొత్తగా మరో ముగ్గురిని సెలెక్షన్‌ కమిటీలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోనని పాక్‌ క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ముల్తాన్‌ టెస్ట్‌లో పాక్‌ పర్యాటక ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. జో రూట్‌ డబుల్‌ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్‌ సెంచరీతో‌ (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్‌ (823/7 డిక్లేర్‌) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్‌) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్‌ (63), ఆమెర్‌ జమాల్‌ (55 నాటౌట్‌) పాక్‌ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. 

చదవండి: డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్‌ సిరాజ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)