Breaking News

అసలుసిసలైన ఛేజింగ్‌ మాస్టర్‌ ఇతడే.. మార్మోగిపోతున్న శశాంక్‌ సింగ్‌ పేరు

Published on Sat, 04/27/2024 - 15:13

పంజాబ్‌ కింగ్స్‌ మెరుపు వీరుడు శశాంక్‌ సింగ్‌ పేరు ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో మార్మోగిపోతుంది. కేకేఆర్‌పై చారిత్రక ఇన్నింగ్స్‌ (28 బంతుల్లో 68 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అనంతరం నెట్టింట ఎక్కడ చూసినా శశాంక్‌ గురించే చర్చ నడుస్తుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో శశాంక్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడని జనాలు జేజేలు కొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో శశాం​క్‌ ఆడిన షాట్లు న భూతే న భవిష్యతి అన్నట్లున్నాయని కొనియాడుతున్నారు. 

శశాంక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్న క్రమంలో ఓ నెటిజన్‌ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌లోని డేటాను చూసిన వారు శశాంక్‌ను అసలుసిసలైన ఛేజింగ్‌ మాస్టర్‌ అనక మానరు. ఈ పోస్ట్‌లో శశాంక్‌ ఛేజింగ్‌లో చేసిన పరుగుల గురించి ప్రస్తావించబడింది. 

ఛేజింగ్‌లో (ప్రస్తుత సీజన్‌) శశాంక్‌ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట నాటౌట్‌గా నిలిచాడు. అంతే కాదు శశాంక్‌ తన అబ్బురపరిచే బ్యాటింగ్‌ విన్యాసాలతో రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గణంకాలు చూసిన తర్వాత ఇతడే అసలుసిసలైన ఛేజింగ్‌ మాస్టర్‌ అంటూ జనాలు శశాంక్‌ను కొనియాడుతున్నారు. 

ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో శశాంక్ ఆడిన ఇన్నింగ్స్‌లు..

- లక్నోపై 7 బంతుల్లో 9 నాటౌట్‌
- గుజరాత్‌పై 29 బంతుల్లో  61 నాటౌట్‌ (పంజాబ్‌ గెలుపు)
- సన్‌రైజర్స్‌పై 25 బంతుల్లో 46 నాటౌట్‌
- ముంబై ఇండియన్స్‌పై 25 బంతుల్లో 41
- కేకేఆర్‌పై 28 బంతుల్లో 68 నాటౌట్‌ (పంజాబ్‌ గెలుపు)

మ్యాచ్‌ విషయానికొస్తే.. శశాంక్‌తో పాటు బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్‌; 8 ఫోర్లు, 9 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చెలరేగడంతో పంజాబ్‌ కేకేఆర్‌ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్‌ నరైన్‌ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్‌ అయ్యర్‌ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)