Breaking News

రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...

Published on Wed, 12/31/2025 - 08:49

లాహోర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ తొలి దశ మ్యాచ్‌లకు గాను ఇచ్చిన మ్యాచ్‌ ఫీజుపై పాకిస్తాన్‌ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ తొలి దశ మ్యాచ్‌ల్లో భాగంగా... ఈ నెల అర్జెంటీనాలో పాకిస్తాన్‌ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటికి సంబంధించిన రోజూవారీ భత్యాలు తాజాగా అందించారు. 

అయితే ముందు చెప్పిన దాంట్లో మూడో వంతు ఫీజులు కూడా ఇవ్వకపోవడంపై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆడబోమని వెల్లడించారు. 

ఇది చాలా అవమానకరం
‘అర్జెంటీనాలో జరిగిన ప్రొ లీగ్‌ సందర్భంగా రోజుకు 30,000 రూపాయలు ఇస్తామని ముందు చెప్పారు. కానీ దానికి బదులు రోజుకు 11,000 చొప్పున ఇచ్చారు. ఇది చాలా అవమానకరం. అంటే డాలర్ల రూపంలో చూసుకుంటే రోజుకు 110 డాలర్లు ఇస్తామని చెప్పి 40 డాలర్లు కూడా ఇవ్వలేదు. 

చెప్పిన దానికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది’ అని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లకు 30,000 రూపాయలు రోజూవారీ భత్యం చెల్లించాలనేది పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య విధానం. 

మేము ఏమీ చేయలేం
కానీ ప్రొ లీగ్‌ రెండు దశలకు జట్టు మొత్తం ఖర్చులను పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ బోర్డు నిధులు సమకూరుస్తున్నందున ఈ విషయంలో మేము ఏమీ చేయలేం’ అని ఎఫ్‌ఐహెచ్‌ కార్యదర్శి రాణా ముజాహిద్‌ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనా అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్‌ జట్టు పరాజయం పాలైంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)