Breaking News

న్యూజిలాండ్‌ బ్యాటర్‌కు దండం పెట్టిన డచ్‌ బౌలర్‌..! వీడియో వైరల్‌

Published on Tue, 10/10/2023 - 17:48

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌కు డచ్‌ బౌలర్‌ పాల్ వాన్ మీకెరెన్ చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు.

అసలేం జరిగిందంటే?
కివీస్‌ ఇన్నింగ్స్‌ 39 ఓవర్‌ వేసిన పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో రెండో బంతికి మిచెల్‌ స్ట్రైట్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి నాన్‌ స్ట్రైక్‌లోని స్టంప్స్‌ను గిరాటేసింది. అంతకంటే ముందు వాన్ మీకెరెన్‌ కాలికి బలంగా తాకిండేది. కానీ మీకెరెన్‌ ఆఖరి నిమిషంలో తన కాలిని వెనుక్కితీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

లేదంటే భారీ గాయం అయిండేది. అయితే సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాన్ మీకెరెన్.. చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 13న బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. నెదర్లాండ్స్‌ ఆక్టోబర్‌ 17న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్‌.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ!

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)