Breaking News

ఐర్లాండ్‌ కెప్టెన్‌ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Mon, 08/21/2023 - 12:57

అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్‌ కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో అ‍త్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా స్టిర్లింగ్‌ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్‌ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో డకౌటైన స్టిర్లింగ్‌.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ ఓబ్రియన్‌ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఓబ్రియన్‌ను స్టిర్లింగ్‌ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్‌ చకాబ్వా(11), సౌమ్య సర్కార్‌(11) ఉన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత్‌ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఐరీష్‌ కోల్పోయింది. భారత్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్‌ చతికిలపడింది.

లక్ష్యఛేదనలో ఐరీష్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్‌ బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది.
చదవండిIND vs IRE: జైలర్‌ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)