Breaking News

దేవాంక్‌ ధమాకా

Published on Mon, 12/09/2024 - 04:18

పుణే: స్టార్‌ రెయిడర్‌ దేవాంక్‌ దలాల్‌ 14 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్‌ పదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 38–28 పాయింట్ల తేడాతో మాజీ విజేత జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే దేవాంక్‌ తన రెయిడింగ్‌తో వరుస పాయింట్లు కొల్లగొట్టగా... అతడికి అయాన్‌ (6 పాయింట్లు), దీపక్‌ (5 పాయింట్లు), అంకిత్‌ (5 పాయింట్లు) సహకరించారు. 

పింక్‌ పాంథర్స్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 7 పాయింట్లతో పోరాడాడు. తాజా సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన పట్నా పైరేట్స్‌ 10 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 58 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 17 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 49 పాయింట్లు సాధించిన పింక్‌ పాంథర్స్‌ ఏడో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 34–33 పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.

గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమాన్‌ సింగ్, రాకేశ్‌ సుంగ్రోయా చెరో 10 పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టు తరఫున అజిత్‌ చవాన్‌ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో దబంగ్‌ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు