పట్నా పైరేట్స్‌ ప్రతాపం

Published on Tue, 11/12/2024 - 08:39

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ జోరు కొనసాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్‌ తరఫున రెయిడర్‌ అయాన్‌ 10 పాయింట్లతో టాపర్‌గా నిలవగా... దేవాంక్‌ (6 పాయింట్లు), సందీప్‌ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్‌ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు. 

గుమన్‌ సింగ్, పార్తీక్‌ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నెగ్గిన గుజరాత్‌ టీమ్‌కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్‌ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్‌ జెయింట్స్‌ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌... పుణేరీ పల్టన్‌తో దంబగ్‌ ఢిల్లీ తలపడతాయి.  

హరియాణా స్టీలర్స్‌ హ్యాట్రిక్‌ 
మరోవైపు హరియాణా స్టీలర్స్‌ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్‌లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్‌ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్‌ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్‌రౌండర్‌ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్‌ చౌహాన్‌ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. 

రెయిడర్‌ అజిత్‌ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)