Breaking News

టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!

Published on Sun, 04/20/2025 - 16:38

ఐపీఎల్‌-2025 (IPL 2025) సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలిసారి కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందాడు రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar). విశేష ఆదరణ కలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు.

రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. అనంతరం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 2008 తర్వాత తొలిసారి చెపాక్‌లో ఓడించింది.

సొంత మైదానంలో ఇంత వరకు గెలవలేదు
అయితే, ఇతర వేదికలపై సత్తా చాటిన ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిన పాటిదార్‌ సేన.. తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తిరిగి గెలుపు బాట పట్టింది.

తర్వాత మళ్లీ పాత కథే. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అనంతరం జైపూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరిగా.. మరలా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలైంది.

ఈ క్రమంలో ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగింట గెలిచింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప రజత్‌ పాటిదార్‌ గురించి ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా రాణిస్తున్న పాటిదార్‌ పేరు.. టీమిండియా కెప్టెన్సీ రేసులోనూ వినిపిస్తుందని అంచనా వేశాడు.

టీమిండియా కెప్టెన్సీ రేసులో
‘‘ఆర్సీబీ బ్యాటింగ్‌ విషయంలో రజత్‌ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాయకుడిగా గొప్ప పరిణతి కనబరుస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా గెలవాలన్న అంశంపై అతడు మరింత దృష్టి సారించాల్సి ఉంది.

ఒకవేళ పాటిదార్‌ ఇలాగే తన విజయపరంపరను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ గురించి జరిగే చర్చల్లో ముందుగా అతడి పేరే వినిపిస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.

జట్టులో చోటే లేదే!
కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల రజత్‌ పాటిదార్‌ 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గతేడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. కానీ టీ20లలో మాత్రం అతడికి ఇంత వరకు భారత్‌ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక మూడు టెస్టుల్లో 63, ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు పాటిదార్‌.

అయితే, ఐపీఎల్‌లో కూడా ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా 1008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటుకే నోచుకోవడం లేని పాటిదార్‌ పేరు కెప్టెన్సీ రేసులో ఊహించడమే కష్టం. అలాంటిది రాబిన్‌ ఊతప్ప మాత్రం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

చదవండి: Vaibhav Suryavanshi: యువీ- లారా కలిస్తే అతడు.. చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)