Breaking News

ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

Published on Mon, 02/16/2026 - 22:48

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఆస్ట్రేలియాకు మ‌రోసారి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం పల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ త‌న 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌల‌ర్ల‌లో హేమంత మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా, క‌మిందు మెండిస్‌, వెల్ల‌లాగే త‌లా వికెట్ సాధించారు.

నిస్సాంక సూప‌ర్ సెంచ‌రీ..
అనంత‌రం 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. లంక ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక‌.. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.

నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గమ‌నార్హం. అత‌డితో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ (51), ప‌వ‌న్ ర‌త్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఆసీస్ ఇంటికే!
ఈ విజ‌యంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించింది. కానీ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైన ఆసీస్ మాత్రం త‌మ సూప‌ర్‌-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల ప‌ట్టిక‌లో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో  ఉంది. ఆసీస్ సూప‌ర్-8కు చేరాలంటే జింబాబ్వే త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల‌లో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమ‌న్‌పై ఆసీస్ భారీ విజ‌యం సాధించాలి.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)