Breaking News

2023లో సాధించాల్సినవన్నీ సాధించిన పాట్‌ కమిన్స్‌.. తాజాగా..!

Published on Tue, 01/16/2024 - 12:43

ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గతేడాది (2023) క్రికెట్‌లో సాధించాల్సిన ఘనతలన్నీ సాధించాడు. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాను వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలబెట్టిన కమిన్స్‌.. ఆతర్వాత ఇంగ్లండ్‌పై యాషెస్‌ సిరీస్‌ విజయం, వన్డే వరల్డ్‌కప్‌ విక్టరీ, ఐపీఎల్‌ 2024 వేలంలో 20.25 కోట్ల రికార్డు ధర, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు, టెస్ట్‌ల్లో హ్యాట్రిక్‌ ఐదు వికెట్ల ఘనత.. ఇలా ఫార్మాట్లకతీతంగా గతేడాది అన్ని ఘనతలను సాధించాడు.

తాజాగా కమిన్స్‌ 2023 డిసెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు కూడా దక్కించుకుని గతేడాది అత్యధిక సక్సెస్‌ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు కోసం బంగ్లాదేశ్‌ ఆటగాడు తైజుల్‌ ఇస్లాం, కివీస్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ పోటీ పడినప్పటికీ అంతిమంగా అవార్డు కమిన్స్‌నే వరించింది.

కమిన్స్‌ డిసెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిప్పులు చెరిగాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను ఏకంగా 10 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తైజుల్‌ ఇస్లాం, గ్లెన్‌ ఫిలిప్స్‌ సైతం గత నెలలో అద్భుతంగా రాణించారు. తైజుల్‌ న్యూజిలాండ్‌తో  జ‌రిగిన తొలి టెస్టులో 6 వికెట్ల ప్రదర్శనతో రాణించి, బంగ్లాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదే సిరీస్‌లో కివీస్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ సైతం అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్ల ఘనతతో పాటు బ్యాటింగ్‌లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మహిళల విభాగంలో దీప్తి శర్మ..
మహిళల విషయానికొస్తే డిసెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను వరించింది. ఈ అవార్డు కోసం మరో టీమిండియా ప్లేయర్‌ జెమీమా రోడ్రిగెజ్‌, జింబాబ్వే బౌలర్‌ ప్రీసియ‌స్ మ‌రంగే  పోటీపడ్డారు. 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)