Breaking News

స్టార్క్‌ సంచలన ప్రకటన తర్వాత ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ

Published on Tue, 09/02/2025 - 07:47

వచ్చే నెలలో న్యూజిలాండ్‌, భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది సేపట్లోనే టెస్ట్‌ జట్టు కెప్టెన్‌, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌ అయిన పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా రెండు సిరీస్‌లకు దూరమైనట్లు ప్రకటన వెలువడింది. కమిన్స్‌ న్యూజిలాండ్‌, భారత్‌ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ప్రకటన చేసింది.

కమిన్స్‌కు వెన్నెముక కింది భాగంలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. దీంతో కమిన్స్‌ను ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (నవంబర్‌ 21) వరకు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యలో కమిన్స్‌ దేశవాలీ టోర్నీల్లో (వన్డే కప్‌, షెఫీల్డ్‌ షీల్డ్‌) కూడా పాల్గొనడని తెలిపింది.

కాగా, ఆస్ట్రేలియా వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్‌ 1, 3, 4 తేదీల్లో మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆతర్వాత అదే నెల 19 నుంచి భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు (19, 23, 25), ఐదు టీ20లు (29, 31, నవంబర్‌ 2, 6, 8) జరుగుతాయి. 

దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ నవంబర్‌ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరుగనుంది. యాషెస్‌ సిరీస్‌ కోసం ఫిట్‌గా ఉండడం కోసమే క్రికెట్‌ ఆస్ట్రేలియా కమిన్స్‌ను చాలాకాలం ఆటకు దూరంగా ఉంచనుంది. 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు