Breaking News

మిచెల్‌ మార్ష్ సారథ్యంలో.. 

Published on Fri, 01/02/2026 - 04:17

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌ కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగే ఆసీస్‌ బృందానికి మిచెల్‌ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ఉపఖండంలో వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో... జట్టు ఎంపికలో స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్‌ కమిన్స్, జోష్‌ హాజల్‌వుడ్, టిమ్‌ డేవిడ్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. 

వరల్డ్‌కప్‌ సమయానికి వీరు ఫిట్‌నెస్‌ సాధిస్తారని చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే ఆడని స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ టి20లకు వీడ్కోలు పలకడంతో... కూపర్‌ కొనొల్లీకి జట్టులో చోటు దక్కింది. ఆసీస్‌ ఆడిన గత 12 టి20 మ్యాచ్‌ల్లో ఆడని కొనొల్లీ ఎంపిక ఒక్కటే ఆశ్యర్చ పరిచే నిర్ణయం! గ్రీన్, స్టొయినిస్, టిమ్‌ డేవిడ్, మ్యాక్స్‌వెల్‌ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.

 ఈ జట్టులో మార్పు చేర్పులకు ఈ నెల 31 వరకు ఐసీసీ అవకాశం కలి్పంచింది. ఐర్లాండ్, ఒమాన్, శ్రీలంక, జింబాబ్వేలతో కలిసి ఆ్రస్టేలియా గ్రూప్‌ ‘బి’లో పోటీ పడనుంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆసీస్‌ తొలి మ్యాచ్‌ఆడనుంది. ఆ తర్వాత 13న జింబాబ్వేతో, 16న శ్రీలంకతో, 20న ఒమాన్‌తో తలపడుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది టి20 ప్రపంచ కప్‌లు జరగగా... అందులో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌ రెండేసి సార్లు ట్రోఫీ దక్కించుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది.  

ఆ్రస్టేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెపె్టన్‌), హెడ్, ఇన్‌గ్లిస్, జేవియర్, కూపర్‌ కొనొల్లీ, కమిన్స్, టిమ్‌ డేవిడ్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, నాథన్‌ ఎలీస్, హాజల్‌వుడ్,  కునేమన్, షార్ట్, జంపా.  

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)