Breaking News

ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. సౌతాఫ్రికా సిరీస్‌ నుంచి కెప్టెన్‌ ఔట్‌..!

Published on Tue, 08/15/2023 - 20:13

సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకుంటాడని సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

కమిన్స్‌ స్థానంలో టీ20 జట్టు కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు వీలైనంత విశ్రాంతి కల్పించాలన్నది క్రికెట్‌ ఆస్ట్రేలియా యోచనగా తెలుస్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌తో వన్డే సిరీస్‌ సమయానికంతా సిద్ధంగా ఉండాలని సీఏ కమిన్స్‌ సూచించిందని సమాచారం.   

కాగా, ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాతో పర్యటించనున్న విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. యాషెస్‌ సిరీస్‌-2023 ఆఖరి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన కమిన్స్‌  (ఎడ‌మ‌ చేతి మ‌ణిక‌ట్టు విరిగింది) వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌ సమయానికంతా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. 

 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)