Breaking News

చ‌రిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్‌.. ప్ర‌పంచంలోనే తొలి కెప్టెన్‌గా

Published on Mon, 01/06/2025 - 12:03

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా త‌మ 10 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. చివ‌ర‌గా  2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్‌కు బీజీటీ టైటిల్‌ను అందించ‌గా.. మ‌ళ్లీ ఇప్పుడు ప్యాట్ క‌మ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల క‌ల‌నేర‌వేరింది.

సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. బీజీటీతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజ‌యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌ది కీల‌క పాత్ర.

సిరీస్ అసాంతం క‌మ్మిన్స్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌నతో అద‌ర‌గొట్టాడు.  2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌మ్మిన్స్‌.. తన జ‌ట్టును వ‌రుస‌గా రెండు సార్లు వ‌ర‌ల్డ్‌టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు చేర్చాడు.

క‌మ్మిన్స్ అరుదైన ఘ‌న‌త..
ఈ క్ర‌మంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబ్లూటీసీ సైకిల్స్‌(2021-23, 2023-25)లో కమ్మిన్స్‌ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్‌లు ఆడగా 20 గెలిచింది.

క‌మ్మిన్స్ త‌ర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సార‌థ్యంలో 29 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆడ‌గా.. 17 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మూడో స్ధానంలో 14 విజ‌యాల‌తో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
చదవండి: CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే? స్టార్‌ ప్లేయర్‌కు ఛాన్స్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)