Breaking News

చరిత్ర సృష్టించిన కమ్మిన్స్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

Published on Sun, 06/23/2024 - 08:19

ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా కింగ్‌స్టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

తొలుత 18వ ఓవర్ వేసిన కమ్మిన్స్ ఆఖరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 20 ఓవర్ వేసిన కమ్మిన్స్..  వరుస బంతుల్లోకరీం జనత్,  గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకముందు ఇదే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. అదేవిధంగా మరో కొన్ని రికార్డులను కూడా కమ్మిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

కమ్మిన్స్‌ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.

అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాతో లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌతీ (న్యూజిలాండ్‌), మార్క్ పావ్లోవిక్ (సెర్బియా), వసీం అబ్బాస్ (మాల్టా), పాట్ కమ్మిన్స్ (ఆసీస్‌) ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)