Breaking News

Paralympics: తొలి స్వర్ణం నెదర్లాండ్స్‌ ఖాతాలో...

Published on Fri, 08/30/2024 - 10:32

ఒలింపిక్స్‌ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్‌ ఒలింపిక్‌ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్‌ ప్రధాన ఈవెంట్‌ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్‌ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. 

50 వేల మంది ప్రేక్షకులు
సూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్‌ హైలైట్‌గా నిలవగా... మయన్మార్‌ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్, మహిళా షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాధవ్‌ వ్యవహరించారు. 

నెదర్లాండ్స్‌ ఖాతాలో...
ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్‌ పారాలింపిక్స్‌ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్‌ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్‌ ట్రాక్‌ సీ4–5 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో నెదర్లాండ్స్‌ సైక్లిస్ట్‌ కరోలైన్‌ గ్రూట్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)