Breaking News

Olympics 2024: మనోళ్లకు భారీ షాక్‌.. సాత్విక్‌- చిరాగ్‌ అవుట్‌

Published on Thu, 08/01/2024 - 17:44

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి- చిరాగ్‌ శెట్టి క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు.

ప్రపంచ మూడో ర్యాంక్‌ ద్వయం ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు. 

ఒత్తిడిని అధిగమించలేక
కాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్‌- చిరాగ్‌ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

అయితే,  భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.

ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో మహారాష్ట్ర షూటర్‌ స్వప్నిల్‌ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్‌ విభాగంలో నిఖత్‌ జరీన్‌ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్‌- చిరాగ్‌ జోడీ కూడా నిరాశపరిచింది.

చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్‌ జరీన్‌ కన్నీటి పర్యంతం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)