Breaking News

Olympics 2024: బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి

Published on Thu, 08/01/2024 - 15:42

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. బెల్జియంతో హోరాహోరీగా సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన ఓటమిపాలైంది. దీంతో పూల్‌-బిలో భారత్‌ రెండోస్థానానికి పడిపోగా.. తాజా విజయంతో బెల్జియం టాప్‌లోకి దూసుకువెళ్లింది.

కాగా భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, బలాబలాలను పరీక్షించుకునే క్రమంలో గ్రూపు దశలో.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ బెల్జియంతో తలపడింది. నాకౌట్‌ దశకు ముందు ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న భారత్‌.. గెలుపొంది ఉంటే ఆత్మవిశ్వాసం ఇనుమడించి ఉండేది.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌
అయినప్పటికీ టోక్యో గోల్డ్‌ మెడలిస్ట్‌ బెల్జియంకు భారత్‌ గట్టిపోటీనిచ్చింది. భారత్‌ తరఫున అభిషేక్‌ గోల్‌(18వ నిమిషంలో)తో మెరవగా.. బెల్జియం ప్లేయర్లలో తిబియూ స్టాక్‌బ్రోక్స్‌(33వ నిమిషంలో), జాన్‌-జాన్‌ డొమెన్‌(44వ నిమిషం) చెరో గోల్‌ సాధించారు. ఫలితంగా 1-2తో భారత జట్టు బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఇక బెల్జియం కూడా ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఇదిలా ఉంటే.. తదుపరి మ్యాచ్‌లో భారత్‌ ఆఖరిగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఐర్లాండ్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో
గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి... పూర్వవైభవాన్ని గుర్తు చేసిన భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్‌లోనూ శుభారంభం అందుకుంది. ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న టీమిండియా 7 పాయింట్లతో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. పూల్‌ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత హాకీ జట్టు 2–0తో ఐర్లాండ్‌ను ఓడించింది.

ఇక మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటాడు. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు రాగా.. అందులో కేవలం ఒక్క దాన్ని మాత్రమే గోల్‌గా మలచగలిగింది. మరోవైపు ఐర్లాండ్‌ 10 పెనాల్టీ కార్నర్‌ లను వృథా చేసింది.  

తొలి రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్‌ చేసిన టీమిండియా... ద్వితీయార్థంలో గోల్‌ కొట్టలేకపోయింది. మన డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి ప్రయత్నాలను భగ్నం చేశాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్‌ నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు చేరుతాయి.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 పురుషుల హాకీ పూల్స్‌
పూల్‌-ఏ: నెదర్లాండ్స్‌, జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, సౌతాఫ్రికా
పూల్‌-బి: బెల్జియం, భారత్‌, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌.

చదవండి: Paris Olympics 2024: షూటింగ్‌లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్‌ కుసాలె..?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)