Breaking News

ఒలింపిక్స్‌లో ఇవాల్టి (జులై 29) భారత షెడ్యూల్‌

Published on Mon, 07/29/2024 - 07:29

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండో రోజు (జులై 28) భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మనూ భాకర్‌ భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్‌  రైఫిల్‌ విభాగంలో రమిత జిందాల్‌, పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్‌ బబుతా ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 

మూడో రోజు (జులై 29) రమిత జిందాల్‌, అర్జున్‌ బబుతా పతక రేసులో నిలువనున్నారు. ఒలింపిక్స్‌లో ఇవాల్టి భారత షెడ్యూల్‌ ఇలా ఉంది.

బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌: మధ్యాహ్నం 12 గంటలకు: సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి/చిరగ్‌ షెట్టి వర్సెస్‌ మార్క్‌ లంప్స్‌ఫస్‌/మర్విన్‌ సెయిడెల్‌ (జర్మనీ)

మహిళల డబుల్స్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌: మధ్యాహ్నం 12:50 గంటలకు: అశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్‌ నమి మత్సుయమా/చిహారు షిదా (జపాన్‌)

పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌: సాయంత్రం 5: 30 గంటలకు:  లక్ష్య సేన్‌ వర్సెస్‌ సూలియన్‌ కర్రెగ్గి (బెల్జియం)

షూటింగ్‌: మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌ (రమిత జిందాల్‌): మధ్యాహ్నం ఒంటి గంటకు

పురుషుల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ (పృథ్వీరాజ్‌ తొండైమాన్‌): మధ్యాహ్నం ఒంటి గంటకు 

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్స్‌ (అర్జున్‌ బబుతా): మధ్యాహ్నం 3 గంటలకు

టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ (రోహన్‌ బోపన్న/ ఎన్‌ శ్రీరామ్‌ బాలాజీ): మధ్యాహ్నం 3:30 గంటల నుంచి

హాకీ: పురుషుల పూల్‌-బి మ్యాచ్‌: భారత్‌ వర్సెస్‌ అర్జెంటీనా: సాయంత్రం 4:15 గంటలకు

ఆర్చరీ: పురుషుల రికర్వ్‌ టీమ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌: తరుణ్‌దీప్‌ రాయ్‌, ధీరజ్‌ బొమ్మదేవర, ప్రవీణ్‌ జాదవ్‌: సాయంత్రం 6:30 గంటలకు

టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌: ఆకుల శ్రీజ వర్సెస్‌ జియాన్‌ జెంగ్‌ (సింగపూర్‌): రాత్రి 11:30 గంటలకు

మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌: మనిక బత్రా వర్సెస్‌ ప్రీతిక పవడే (ఫ్రాన్స్‌): మధ్య రాత్రి 12:30 గంటలకు

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)