Breaking News

వేలంలో అన్‌సోల్డ్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ప‌ర్ధీప్ న‌ర్వాల్‌

Published on Tue, 06/03/2025 - 13:35

కబడ్డీ లెజెండ్, స్టార్ రైడ‌ర్‌ పర్దీప్ నర్వాల్ సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నాడు. హ‌ర్యానాకు చెందిన పర్దీప్ నర్వాల్.. ప్రొఫెషనల్ క‌బ‌డ్డీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.  ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో ప‌ర్దీప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు.

స్పోర్ట్స్ బ్రాడ్‌క్టాస్ట‌ర్ సునీల్ తనేజాతో ఇంటార‌క్ష‌న్‌లో ప‌ర్ధీప్ ఈ షాకింగ్ న్యూస్‌ను వెల్ల‌డించాడు. కోచ్‌గా త‌న కొత్త అవ‌త‌రామెత్త‌నున్న‌ట్లు న‌ర్వాల్ తెలిపాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ప‌ర్దీప్ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పాట్నా పైరేట్స్ వ‌రుస‌గా మూడు పీకెఎల్ టైటిల్స్‌ను గెల‌వ‌డంలో న‌ర్వాల్‌ది కీల‌క పాత్ర‌. 

అదేవిధంగా ప్రోక‌బ‌డ్డీ లీగ్ హిస్ట‌రీలో అత్య‌ధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు కూడా న‌ర్వాల్ పేరిట ఉంది. ఈ హ‌ర్యానా ఆట‌గాడు పీఎకెల్‌లో 190 మ్యాచ్‌లు ఆడి 1801 పాయింట్లు సాధించాడు. మ్యాచ్‌కు సగటున 9.47 రైడ్ సాధించ‌డం విశేషం. 

అయితే గ‌త నాలుగు సీజ‌న్ల‌లో ప‌ర్ధీప్ త‌న ఫామ్‌ను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు.  యుపి యోధాస్, బెంగళూరు బుల్స్ త‌ర‌పున న‌ర్వాల్ పెద్ద‌గా రాణించ‌లేకపోయాడు. కాగా గతంలో భార‌త క‌బ‌డ్డీ జ‌ట్టుకు కూడా న‌ర్వాల్ ఆడాడు.
చదవండి: IPL 2025 Final: 'అత‌డితో పంజాబ్ జాగ్ర‌త్త‌గా ఉండాలి.. లేదంటే వార్ వ‌న్ సైడే'
 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)